అధికారిక(Official) బంగ్లాలో నోట్ల కట్టలు దొరికిన ఘటనలో హైకోర్టు న్యాయమూర్తిని పక్కనబెట్టారు. ఢిల్లీ హైకోర్టు జడ్జి జస్టిస్ యశ్వంత్ వర్మను విధుల నుంచి తప్పిస్తూ అక్కడి CJ ఉత్తర్వులిచ్చారు. CJI సంజీవ్ ఖన్నా ఆదేశాల మేరకు వర్మను తప్పించారు. ఈ నెల 14న హోలీ నాడు జస్టిస్ వర్మ బంగ్లాలో అగ్నిప్రమాదం జరిగింది. మంటలు ఆర్పుతున్న టైంలో కోట్లల్లో నగదు బయటపడింది. దీనిపై CJI ఆదేశాల మేరకు ఢిల్లీ హైకోర్టు CJ దేవేంద్ర కుమార్ ఉపాధ్యాయ రిపోర్ట్ అందజేశారు.