
పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో మొంథా తుపాను తీవ్రంగా మారింది. 6 గంటలుగా 12 కి.మీ. వేగంతో దూసుకువస్తోంది. కాకినాడకు 240 కి.మీ. దూరంలో ఉండగా, ఈ రాత్రి తీరం దాటనుంది. తుపాను ప్రభావంతో పలు జిల్లాల్లో భారీ వర్షాలు పడనున్నాయి. ఖమ్మం, ములుగు జిల్లాలకు రెడ్ అలర్ట్… మంచిర్యాల పెద్దపల్లి, భూపాలపల్లి, హన్మకొండ, వరంగల్ మహబూబాబాద్, సూర్యాపేట, నల్గొండ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ అయింది.