మొన్నటివరకు విపరీతమైన ఎండ, ఉక్కపోతతో ఇబ్బందులు పడ్డ దేశ రాజధాని(Capital) ఢిల్లీ.. నిన్నట్నుంచి కుండపోత వర్షాలతో అతలాకుతలమైంది. రోడ్లన్నీ నదుల్లా మారి పడవల్లో తిరగాల్సిన పరిస్థితి ఏర్పడింది. విమానాశ్రయంలో పైకప్పు(Roof) కూలిన ఘటనలో ఒకరు ప్రాణాలు కోల్పోతే మరో 8 మంది గాయపడ్డ ఘటనపై పౌర విమానయాన శాఖ మంత్రి స్పందించారు. ఎయిర్పోర్టును పరిశీలించి టెర్మినల్-1లో ఫ్లైట్లను రద్దు చేసి గేట్-1, గేట్-2 మూసివేస్తున్నామన్నారు.
ముందస్తుగా భావిస్తున్న వర్షాలు వాతావరణాన్ని ఒక్కసారిగా మార్చేశాయి. చాలా వాహనాలు నీటిలో చిక్కుకుపోగా, ప్రజలు అడుగు బయటపెట్టలేని తీరు ఏర్పడింది. నిన్నట్నుంచి ఇప్పటివరకు 15 సెంటీమీటర్ల వర్షపాతం(Rainfall) నమోదైంది. పార్లమెంటు పరిసరాలు, సెంట్రల్ ఢిల్లీతోపాటు అన్ని చోట్లా నడుము లోతు నీరు చేరింది.