మామూళ్లతో అధికారుల జేబులు తడుస్తున్నందున కేబుళ్ల సంగతి మరచిపోయారంటూ హైకోర్టు మండిపడింది. కేబుళ్లు నల్లగా ఉన్నందున గుర్తు పట్టలేదన్న వాదనపై.. నోట్లపై గాంధీ బొమ్మను మాత్రం బాగా గుర్తు పడతారు అంటూ ఆగ్రహం వ్యక్తం చేసింది. GHMCలో కేబుళ్ల తొలగింపుపై భారతీ ఎయిర్ టెల్(Airtel) వేసిన పిటిషన్ పై వాదనలు జరిగాయి. లైసెన్సువి తప్ప మిగతా అన్నింటినీ తొలగించాలని జస్టిస్ నగేశ్ భీమపాక ఆదేశించారు. హైదరాబాద్ రామంతపూర్ లో కరెంట్ షాక్ తో ఐదుగురు మృతిచెందడంపై జడ్జి ఆవేదన వ్యక్తం చేశారు. తన బర్త్ డే నాడు తండ్రి చితికి నిప్పంటించాల్సిన దుస్థితి బాలుడికి వచ్చిందని, దీనికి అందరూ బాధ్యులేనని జస్టిస్ నగేశ్ భీమపాక అన్నారు.