దేశవ్యాప్తంగా ఎండలు దంచికొడుతున్నాయి. మహారాష్ట్రలోని నాగ్ పూర్లో శుక్రవారం నాడు 56 డిగ్రీలు దాటింది. అయితే ఇంకా దీన్ని వాతావరణశాఖ ప్రకటించాల్సి ఉంది. దేశంలోని ఇంచుమించు అన్ని రాష్ట్రాల్లోనూ ఇదే పరిస్థితి కనిపిస్తున్నది. ఇక మన రాష్ట్రాన్ని చూస్తే మంచిర్యాల జిల్లా భీమారం, పెద్దపల్లి జిల్లా కమాన్ పూర్లో 47.1 డిగ్రీల అత్యధిక ఉష్ణోగ్రతలు(Temparatures) నమోదయ్యాయి.
అన్ని ప్రాంతాల్లో సాధారణం కన్నా నాలుగైదు డిగ్రీలు ఎక్కువగానే ఎండ ఉంది. అయితే ఇవాళ్టి నుంచి మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఇక దేశవ్యాప్తంగా నమోదైన ఎండలకు 40 మంది దాకా ప్రాణాలు కోల్పోయారు.