కరోనా వైరస్ వ్యాప్తితో దేశవ్యాప్తంగా ఇంప్లిమెంట్ చేసిన లాక్ డౌన్ వల్ల ప్రజలు ఇబ్బందులు పడినా.. ప్రకృతికి మాత్రం అది వరంగా మారింది. డెయిలీ పొల్యూషన్ వల్ల హిమాలయాల్లో భారీగా మంచు కరుగుతూ ఉంటుంది. కానీ లాక్ డౌన్ వల్ల ఆ మంచు కరగకుండా నేచురల్ గా అలాగే ఉండిపోయిందని ఓ రీసెర్చ్ లో వెల్లడైంది. 2020 మార్చి 25 నుంచి 2020 మే 31 వరకు ఈ రీసెర్చిలో భాగంగా పరిశోధకులు హిమాలయాల్ని పరిశీలించారు.
విచ్చలవిడిగా వదులుతున్న ఉద్గారాల వల్ల పొల్యూషన్ భారీగా పెరిగి హిమానీనదులు కరుగుతూ వరదలు, ప్రకృతి విపత్తులకు కారణమవుతుంటాయి. కానీ 2020లో కొవిడ్-19 దృష్ట్యా దేశంలో విధించిన లాక్ డౌన్ తో పొల్యూషన్ ఉన్నట్టుండి తగ్గిపోయింది. ఇది హిమాలయాలను కాపాడినట్లయిందని నేషనల్ అకాడెమీ ఆఫ్ సైన్సెస్(PNAS) తన ప్రొసీడింగ్స్ లో ప్రచురించిన అధ్యయనంలో తెలిపింది.
చైనాలోని బీజింగ్ నార్మల్ యూనివర్సిటీకి చెందిన లికియాంగ్ జాంగ్ తోపాటు ఆయన కొలీగ్స్.. హిమాలయ ప్రాంతంలోని పర్వత సానువుల్లో కలుగుతున్న మార్పుల్ని గమనించి అధ్యయనం మొదలుపెట్టారు. అకస్మాత్తుగా, నాటకీయ తరహాలో మంచు కరగడమనేది తగ్గపోతుండటం… దాన్ని లాక్ డౌన్ ఎలా ప్రభావితం చేసిందన్న దానిపై మల్టీ శాటిలైట్ డేటాతో పోల్చారు. ‘భిన్న వాతావరణం-కెమిస్ట్రీ-స్నో మోడల్’ విధానం ద్వారా పరిశోధన సాగించారు.