వివిధ సంస్కృతులు, విభిన్న భాషల(Languages)కు నెలవైన భారతదేశం ఈరోజు ‘హిందీ దినోత్సవం(Hindi Diwas)’ను జరుపుకుంటున్నది. దేశంలోని ప్రతి రాష్ట్రానికి ఒక ప్రాంతీయ భాష ఉండగా.. 1949 సెప్టెంబరు 14న హిందీ దినోత్సవాన్ని ప్రభుత్వం ప్రకటించింది. 2011 జనాభా లెక్కల ప్రకారం దేశంలో 121 భాషలు, 270 మాతృభాషలు ఉన్నాయి. దేశ జనాభాలో 43.63 శాతం మంది హిందీ మాట్లాడుతున్నారు.
ప్రస్తుతమున్న హిందీ భాష చాలా వరకు సులభతరం చేసిందే. భారత్ లోనే కాకుండా ప్రపంచంలోనూ చాలా దేశాల్లో హిందీలో మాట్లాడుతారు. స్వాతంత్ర్యానికి పూర్వం జాతిని ఐక్యం చేయడానికి కారణమైన హిందీని ‘లాంగ్వేజ్ ఆఫ్ యూనిటీ’గా పిలుస్తారు.