ప్రముఖ హిందీ రచయిత వినోద్ కుమార్ శుక్లా(Shukla)కు జ్ఞానపీఠ్ పురస్కారం దక్కింది. ఛత్తీస్ గఢ్ కు చెందిన ఈయన 2024 సంవత్సరానికి గాను అవార్డుకు ఎంపికయ్యారు. ఆ రాష్ట్రం నుంచి జ్ఞానపీఠ్ అవార్డు సాధించిన తొలి రచయిత శుక్లానే. హిందీ లిటరేచర్లో పేరొందిన 88 ఏళ్ల వినోద్ కుమార్.. 59వ జ్ఞానపీఠ్ అవార్డుకు ఎంపిక కాగా 12వ హిందీ రచయితగా నిలిచారు. అవార్డు కింద సరస్వతీదేవి విగ్రహం, రూ.11 లక్షల నగదు అందుతాయి. 1999లో ఆయన సాహిత్య అకాడెమీ అవార్డును పొందారు. జ్ఞానపీఠ్ అవార్డును 1961లో ప్రవేశపెట్టగా 1965లో తొలిసారి అందజేశారు. అలా తొలి పురస్కారాన్ని మలయాళం రచయిత జి.శంకర కురూప్ దక్కించుకున్నారు.