జమ్మూకశ్మీర్లో ఉగ్రవాదాన్ని(Terrorism) నిర్మూలించేదాకా దాయాది దేశం పాకిస్థాన్ తో చర్చల(Dialogue) ప్రసక్తే లేదని హోంమంత్రి అమిత్ షా అన్నారు. నౌషెరాలో నిర్వహించిన ఎన్నికల సభలో మాట్లాడుతూ.. ఆర్టికల్ 370ని తిరిగి తీసుకువస్తామంటూ మాయమాటలు చెబుతున్నారంటూ నేషనల్ కాన్ఫరెన్స్(NC)తోపాటు కాంగ్రెస్ పై మండిపడ్డారు.
‘ఆర్టికల్ 370 తెస్తామని ఫరూఖ్ అబ్దుల్లా అంటున్నారు.. దాన్ని తిరిగి ఎవరూ తేలేరు ఫరూఖ్ సాబ్.. ఇప్పుడు బంకర్లు అవసరం లేదు ఎందుకంటే నేరుగా బుల్లెట్లు కురిపించే ధైర్యం లేదు కాబట్టి..’ అని అమిత్ షా స్పష్టం చేశారు.