జస్టిస్ యశ్వంత్ వర్మ గతంలో అలహాబాద్ లో పనిచేయగా, 2021లో ఢిల్లీ వచ్చారు. తిరిగి ఆయన్ను అలహాబాద్ కే పంపించి విచారణ ప్రారంభించారు. సుప్రీం, హైకోర్టు జడ్జిల్ని తొలగించే ప్రక్రియ ఇలా ఉంటుంది.
జడ్జిల్ని ఎలా తొలగిస్తారంటే…
సుప్రీం, హైకోర్టు జడ్జిల్ని తొలగించడం(అభిశంసన) పెద్ద ప్రక్రియే. అవినీతి, అక్రమాలకు పాల్పడితే సుప్రీం రూల్స్-1999 ప్రకారం తొలుత వివరణ అడుగుతారు. సరిపోలేదని భావిస్తే అంతర్గత విచారణ చేస్తారు. సుప్రీం జడ్జి, ఇద్దరు హైకోర్టు జడ్జిలు ఇచ్చే రిపోర్ట్ ఆధారంగా రాజీనామాకు CJI ఆదేశిస్తారు. నిరాకరిస్తే అతణ్ని తొలగించాలంటూ కేంద్రానికి లేఖ రాస్తారు. ఆర్టికల్ 124(4), 124(5) ప్రకారం పార్లమెంటు ద్వారా కళంకిత జడ్జి అభిశంసన జరిగాక రాష్ట్రపతి ఉత్తర్వులిస్తారు.
చరిత్రలో ఇవే…
@ అభిశంసన దాఖలైన తొలి జడ్జి జస్టిస్ వి.రామస్వామి. 1993లో లోక్ సభలో ఓటింగ్ జరిగింది. 2/3 మెజార్టీ రాకపోవడంతో అభిశంసన అమలు కాలేదు.
@ 2011లో రాజ్యసభ మెజార్టీ సభ్యులు ఆమోదించడంతో కలకత్తా హైకోర్టు జడ్జి జస్టిస్ సౌమిత్రాసేన్ అభిశంసన జరిగింది. దేశంలో ఇలా జరిగిన తొలి జడ్జి ఆయనే.
@ అవినీతి, భూకబ్జాపై సిక్కిం హైకోర్టు CJ పి.డి.దినకరన్ పై ఆరోపణల్ని పరిశీలించేందుకు రాజ్యసభ ఛైర్మనే ప్యానెల్ వేశారు. కానీ అభిశంసన ప్రక్రియ మొదలవకముందే 2011లో రాజీనామా చేశారు.