హరియాణాలో రెండు వర్గాల మధ్య ఏర్పడ్డ ఘర్షణలు తీవ్ర రూపు దాల్చాయి. ఇప్పటికే నలుగురు ప్రాణాలు కోల్పోయినట్లు ప్రభుత్వం ప్రకటించింది. అయితే ఈ ఘర్షణల్లో ఇప్పటిదాగా 44 కేసులు(Cases) నమోదు చేసి 80 మందిని అరెస్టు(Arrest) చేశారు. సోనా, మనేసర్, పటౌడి ప్రాంతాల్లో ఇంటర్నెట్ బ్యాన్ చేస్తూ గుర్ గ్రామ్ జిల్లా యంత్రాంగం చర్యలు తీసుకుంది. నుహ్ జిల్లాలో మొదలైన ఘర్షణలు 5 జిల్లాలకు స్ప్రెడ్ అయ్యాయి. నుహ్ జిల్లాలోనే 22 కేసులు నమోదు చేశారు. ఈ ఘటనల్లో పలువురు పోలీసులకు తీవ్రంగా గాయాలయ్యాయి.
మరోవైపు ఈ ఘర్షణలు ప్రి ప్లాన్డ్ గా చేసినట్లు కనపడుతోందని ముఖ్యమంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ తోపాటు ఆ రాష్ట్ర హోంమంత్రి ప్రకటించారు. ఐదుగురు చనిపోయినట్లు మంగళవారం వార్తలు వచ్చినా చివరకు నలుగురే మృతి చెందినట్లు ప్రభుత్వం కన్ఫర్మ్ చేసింది. సోమవారం నుంచి నుహ్ లో 48 గంటల కర్ఫ్యూ విధిస్తూ ప్రభుత్వం ఆదేశాలిచ్చింది. వందల సంఖ్యలో గాయపడగా.. ఇళ్లు, ఆస్తులపై భారీయెత్తున దాడులు జరిగాయి. ఈ అల్లర్లు మరిన్ని జిల్లాలకు పాకకుండా ప్రభుత్వం జాగ్రత్తలు తీసుకుంటోంది.