
బిహార్ లో కాంగ్రెస్ కూటమి ఘోర ఓటమి దిశగా సాగుతోంది. ఎగ్జిట్ పోల్స్ అంచనాలకు మించి BJP నేతృత్వంలోని NDA కూటమి ప్రభంజనం నడుస్తోంది. 192 స్థానాల్లో ఆధిక్యంలో ఉన్న NDA.. 200
దిశగా దూసుకుపోతోంది. మొత్తం 243 సీట్లలో మహాఘట్ బంధన్ అలయెన్స్ 50కి కూడా చేరుకోలేని పరిస్థితిలో చిక్కుకుంది. ప్రస్తుతం ఆ కూటమి కేవలం 46 స్థానాల్లోనే ముందంజలో ఉంది. 2020 ఎన్నికలతో చూస్తే ఇప్పటికే NDA 71 సీట్లు ఎక్కువగా సాధించనుంది. గత ఎన్నికల్లో గెలిచిన 69 సీట్లను మహాఘట్ బంధన్ కోల్పోయే ప్రమాదంలో ఉంది. 2020 ఎన్నికల్లో NDA 122,MGB 114, ఇతరులు 7 సీట్లలో గెలిచారు.