

కొత్త బాధ్యతల్లో చేరాల్సిన అధికారులు ముందుగా విందు చేసుకున్నారు. ఫ్రెండ్స్ తో కలిసి రెస్టారెంట్ కు వెళ్లి గొడవ పడ్డారు. ఐఏఎస్, ఐపీఎస్ అన్న విషయం మరచిపోయి వర్కర్స్ ను నిద్రలేపి మరీ నానాయాగీ చేశారు. పోలీసులకు కంప్లైంట్ ఇస్తే అదే పోలీసులతో వచ్చి కర్రలు, రాడ్లతో దాడి చేశారంటూ రెస్టారెంట్ యజమాని తెలిపాడు. మొత్తం 11 మందికి గాయాలైన ఘటన రాజస్థాన్ అజ్ మేర్ వద్ద జరిగింది. అజ్ మేర్ అథారిటీ డెవలప్ మెంట్ కమిషనర్ గా ఉన్న ఐఏఎస్ అధికారి గిరిధర్, గంగాపూర్ సిటీ పోలీసు వింగ్ కు ఓఎస్డీగా నియమితుడైన ఐపీఎస్ సుశీల్ కుమార్ బిష్ణోయ్.. పార్టీ చేసుకునేందుకు రెస్టారెంట్ కు వెళ్లారు. అక్కడ గొడవ పడ్డ దృశ్యాలు సీసీ టీవీ ఫుటేజీల్లో రికార్డయ్యాయి. అవి వైరల్ కావడంతో ఇద్దరు అధికారులపై ప్రభుత్వం వేటు వేసింది.
నమస్తే