విద్యార్థులంతా పరీక్షలు రాస్తున్నారు.. అంతలోనే కలెక్టర్ అక్కడకు వచ్చారు.. ఇదేంటని అడుగుతూనే విద్యార్థి చెంపపై రెండుసార్లు కొట్టారు. ఈ ఘటన మధ్యప్రదేశ్ లోని భింద్(Bhind) జిల్లాలో ఏప్రిల్ 1న జరిగితే ఇప్పుడు సోషల్ మీడియా ద్వారా వెలుగులోకి వచ్చింది. దీన్ దయాళ్ దంగ్రౌలియా మహావిద్యాలయలో మ్యాథ్స్ ఎగ్జామ్ నడుస్తోంది. చేతిలో పేపర్ తో హాళ్లోకి ప్రవేశించిన IAS సంజీవ్ శ్రీవాస్తవ.. విద్యార్థి వద్దకు వెళ్లి ఇదేంటని అడుగుతూనే చెంపపై కొట్టారు. నీ పేపర్ ఎక్కడ అంటూ రోహిత్ రాథోడ్ అనే స్టూడెంట్ పై చేయి చేసుకున్నారు. ఇది దుమారం రేపడంతో సదరు IAS స్పందించారు. మాస్ కాపీయింగ్ ఫిర్యాదులు వచ్చాయని, కొందరు పిల్లలు ప్రశ్నాపత్రాల్ని ఎత్తుకెళ్తున్నారని తెలిసి అలా కొట్టానని వివరణ ఇచ్చారు. మరిన్ని వార్తలకు క్లిక్ చేయండి… https://justpostnews.com