ఓటర్ల జాబితా సవరణ(SIR)కు ఇంటింటి తనిఖీలు చేస్తున్న బిహార్ ఎన్నికల సంఘం(EC) అధికారులు షాక్ అయ్యారు. భారీస్థాయిలో బంగ్లాదేశ్, నేపాల్, మయన్మార్ వాసుల్ని గుర్తించారు. అక్రమ పేర్లు తొలగించి ఫైనల్ లిస్టును సెప్టెంబరు 30కి పూర్తి చేయాలి. ఆగస్టు 1 నుంచి ధ్రువీకరణ ప్రక్రియ మొదలవుతుంది. అనుమానిత విదేశీ పౌరుల్ని చూసి బూత్ లెవెల్ అధికారులు(BLO) ఆశ్చర్యపోయారు. బంగ్లా, మయన్మార్ వాసుల సంఖ్య ఊహించని రీతిలో ఉన్నట్లు గుర్తించారు. అసలైన పౌరులు ఓటుహక్కు కోల్పోయే సర్వే అంటూ ప్రతిపక్షాలు విమర్శిస్తే.. EC నిర్ణయాన్ని సుప్రీంకోర్టు సమర్థించింది. ఆధార్, ఓటర్ ID, రేషన్ కార్డుల్ని ప్రామాణికంగా తీసుకోవాలని ఆదేశించింది. మరిన్ని వార్తలకు క్లిక్ చేయండి…: https://justpostnews.com