2024 సంవత్సరానికి భారత వాతావరణ శాఖ(IMD) తీపికబురు చెప్పింది. దేశమంతటా ఆశించినదానికన్నా ఎక్కువ స్థాయిలో వానలు పడతాయని తెలిపింది. దేశవ్యాప్తంగా ఈసారి సాధారణ వర్షపాతం(Normal Rainfall) కన్నా ఎక్కువగా వానలు పడే అవకాశముందని భారత వాతావరణ శాఖ(Indian Meteorological Dept) అంచనా వేసింది.
వచ్చే జూన్ నుంచి సెప్టెంబరు(June-September) వరకు అంచనాల కంటే అధికంగా వర్షాలు పడే ఛాన్సెస్ ఉన్నాయని తెలిపింది. వచ్చే రుతుపవనాల ఆధారంగా 2024 వర్షాకాలం సీజన్ లో 106 శాతం మేర వర్షాలు కురుస్తాయని అంచనాకు వచ్చింది.
తూర్పు, వాయువ్య, ఈశాన్య రాష్ట్రాల్లోని కొన్ని ప్రాంతాలు మినహాయిస్తే అన్ని చోట్లా నైరుతి రుతుపవనాలు బాగానే ప్రభావితం చేస్తాయని అభిప్రాయపడింది. 1951 నుంచి ఇప్పటివరకు ఉన్న లెక్కల్ని పరిగణలోకి తీసుకున్న IMD ఇందులో తొమ్మిదిసార్లు సాధారణం కన్నా ఎక్కువ వర్షపాతం నమోదైందని, ఈసారి కూడా అదే జరగనుందని అంచనా వేసింది.