దేశవ్యాప్తంగా(Countrywide) ఆగస్టులో భారీ వర్షాలు కురిశాయి. ఈ ట్రెండ్ సెప్టెంబరులోనూ కంటిన్యూ అవుతుందని భారత వాతావరణ శాఖ(IMD) ప్రకటించింది. ఉత్తరాఖండ్, రాజస్థాన్, హిమాచల్ ప్రదేశ్, పంజాబ్ సహా అన్ని రాష్ట్రాల్లోనూ భారీ వర్షాలుంటాయని తెలిపింది. సాధారణం కన్నా ఈ ఆగస్టులో 16% అధికంగా వర్షపాతం నమోదైంది. 2001 నుంచి ఇది ఐదో హయ్యెస్ట్ వర్షపాతం కాగా.. 1901 నుంచి పరిశీలిస్తే ఇవి 29వ అత్యంత పెద్ద వర్షాలు.
దేశ వాయువ్య ప్రాంతంలో 32% ఎక్కువగా వర్షపాతం రికార్డయింది. ఉత్తర బిహార్, ఈశాన్య UP సహా ఉత్తర భారతంలో సెప్టెంబరులోనూ భారీగా వర్షాలు ఉంటాయని IMD తెలిపింది. ఈ ప్రభావంతో పంటలు బాగా వస్తాయని, రబీలోనూ ఆశాజనక దిగుబడులుంటాయని తెలియజేసింది. ఆగస్టులో సాధారణంగా రుతుపవనాలకు విరామ రోజులుగా భావిస్తారు. కానీ ఈసారి అందుకు భిన్నంగా 6 అల్ప పీడనాలు, ఒక తుపాను వచ్చాయి.