భారత్-పాక్ మధ్య యుద్ధ(War) వాతావరణం ఏర్పడ్డ వేళ కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. పాకిస్థాన్ నుంచి వచ్చే కంటెంట్ ను నిషేధిస్తూ(Ban) ఆదేశాలిచ్చింది. OTT, ఇతర మీడియా ప్లాట్ ఫాంల్లో తయారైన కంటెంట్ ను బ్యాన్ చేసింది. పాక్ తయారైన వెబ్ సిరీస్ లు, సినిమా పాటలు, పాడ్ కాస్ట్ లు, మీడియా కంటెంట్ పై నిషేధం అమలవుతుందని కేంద్రం తెలిపింది. 5 భారత ఫైటర్ జెట్లను కూల్చివేశారంటూ పాత వీడియోలతో సోషల్ మీడియాలో ప్రచారం జరిగింది. దీనికి చైనా గ్లోబల్ టైమ్స్ న్యూస్ వంతపాడింది. భారత జెట్లను కూల్చేశారా అని పాక్ మంత్రిని అంతర్జాతీయ మీడియా అడిగితే.. సోషల్ మీడియాలో వస్తుంది కదా అదే నిజం అని చెప్పడంతో వాళ్ల పరువు పోయింది. ఇలాంటి పరిస్థితుల్లో మోదీ సర్కారు పాక్ కంటెంట్ ను నిషేధించింది.