పాకిస్థాన్ ను అన్ని రంగాల్లో ఒంటరి చేస్తున్న భారత్.. మరో దెబ్బ కొట్టింది. శత్రు(Enemy) దేశానికి రుణం ఇవ్వొద్దంటూ అంతర్జాతీయ ద్రవ్య నిధి(IMF)కు స్పష్టం చేసింది. రుణ కేటాయింపుపై జరిగిన భేటీలో వ్యతిరేక ఓటు వేసింది. ఆ దేశ పేలవమైన ట్రాక్ రికార్డును పరిగణలోకి తీసుకోవాలని చెప్పింది. మొత్తం 2.3 బి.డా.లో భాగంగా ఒక బి.డా.(రూ.8,500 కోట్లు) సాయమందించేందుకు మీటింగ్ జరిగింది. ‘పాక్ దీర్ఘకాలిక రుణగ్రహీత.. IMF ప్రోగ్రాంలకు కట్టుబడటం లేదు.. 1989 నుంచి గత 36 ఏళ్లల్లో 28 సంవత్సరాల చెల్లింపులు రావాలి.. 2019 నుంచి గత ఆరేళ్లలో 4 IMF భేటీలు జరిగాయి.. మంచి ఆర్థిక విధానాలు అమలు చేసి ఉంటే మరో బెయిలౌట్ కోసం నిధిని అడిగేది కాదు.. స్పాన్సర్డ్ క్రాస్ బోర్డర్ టెర్రరిజం కోసం IMF ఫైనాన్సింగ్ నిధులు పక్కదారి పడుతున్నాయి..’ అని భారత్ వాదించింది.