అసలు పోరాటంలోనే తెలుస్తుంది ఎవరి సత్తా ఏంటో. మాటలు మాట్లాడినంత తేలికగా కాదు యుద్ధం చేయడమంటే. భారత్ పై దాడికి దిగాలని చూసిన పాకిస్థాన్ కు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. నిన్నటి ఉగ్రవాద శిబిరాలపై దాడులకు ప్రతిగా.. ఉత్తరాదిపై ఒక F-16, రెండు JF-17 ఫైటర్ జెట్లను ప్రయోగించింది. అటు 10కి పైగా మిసైళ్లు, డ్రోన్లు ప్రయోగిస్తే వాటిని భారత సైన్యం నిర్వీర్యం చేసింది. ఈ ఒక్కో ఫైటర్ జెట్ ధర రూ.300-500 కోట్ల వరకు ఉంటుంది. ఇప్పటికే లాహోర్ లోని మిసైల్ డిఫెన్స్ సిస్టంను మట్టుబెట్టిన భారత వాయుసేన.. దాయాదిని కోలుకోకుండా చేసింది. డిఫెన్స్ వ్యవస్థ, ఫైటర్ జెట్ల నిర్వీర్యం, మిసైళ్లు, డ్రోన్ల కూల్చివేతతో పాకిస్థాన్ కు వేల కోట్ల నష్టం వాటిల్లింది. ఈ రాత్రి పాక్ లోని సర్గోధా, ఫైసలాబాద్ లోని రెండు రక్షణ వ్యవస్థల్ని భారత్ పేల్చేసింది. ఇలా ముప్పేట దాడితో సత్తా చాటింది.