యుద్ధమే మొదలుకాలేదు.. ఇక ఆగిందెక్కడ.!
మనం మొదలుపెడితే.. అటువైపు మిగిలేదెక్కడ..!
ఇంతటి విపత్కర పరిస్థితులున్న వేళ.. యుద్ధం అపేశారే అని చాలామంది భావిస్తుండొచ్చు. కానీ అంతకుముందే భారత్ తీసుకున్న నిర్ణయం పాక్ కు ఎప్పటికీ స్ట్రాంగ్ వార్నింగ్ గానే ఉండనుంది. నిజానికి పాకిస్థాన్ కు వేరే దిక్కు లేదు.. యుద్ధం ఆపాలని ప్రాధేమనడం తప్ప. అందుకే రెండ్రోజుల నుంచి డొనాల్డ్ ట్రంప్ తో మాట్లాడేందుకు విశ్వప్రయత్నాలు చేసింది. కానీ మోదీ సర్కారు తీసుకున్న ఈ ఆకస్మిక నిర్ణయం వెనుక ఎంతో మర్మం దాగి ఉంటుంది.
అవేంటో చూద్దాం…
@ భారత్ పై జరిగే ఏ ఉగ్రదాడి అయినా యుద్ధంగానే చూస్తామని మోదీ సర్కారు హెచ్చరించిన కొద్దిసేపటికే కాల్పుల విరమణ జరిగింది. అంటే భవిష్యత్తులో పాక్ అతిగా ప్రవర్తిస్తే ప్రతిచర్య తప్పదన్నది అర్థం. ఇక అమెరికా సైతం దాయాది దేశానికి గట్టి వార్నింగే ఇచ్చి ఉంటుంది. కాబట్టి తింగరి వేషాలకు ఛాన్స్ లేదు.
@ ఈ నాలుగు రోజుల్లో భారత్ సత్తా ఏంటో ప్రపంచానికి తెలిసింది. ఇతర దేశాలపై ఆధారపడకుండా సొంత ఆయుధాలు, శత్రుదేశంలోని లక్ష్యాలు గురి తప్పకపోవడం, సామాన్య పౌరులపై దాడులకు పాల్పడని చాకచక్యాన్ని, భారతీయుల చాణక్యాన్ని ప్రపంచం గుర్తించింది. చైనా, అమెరికా ఫైటర్ జెట్లు కూలిన వేళ.. భారత్ అస్త్రాలు ఎక్కడా గురితప్పలేదు.
@ ఇక సహనం అన్న మాటకు ఏ మాత్రం తావివ్వలేని పరిస్థితి సృష్టించాం. వాస్తవానికి పాకిస్థాన్ తీవ్ర సంక్షోభంలో ఉంది. ఈ యుద్ధం జరిగితే అది పూర్తిగా నాశనమయ్యేది.
@ నాలుగో అతిపెద్ద ప్రపంచ ఆర్థిక వ్యవస్థగా ఈ ఏడాదే అవతరించిన భారత్.. 2026 నాటికి మూడో అతిపెద్ద వ్యవస్థ అవుతుంది. జపాన్ ను వెనక్కునెట్టగా, జర్మనీని సైతం అలాగే చేయబోతున్న భారత్.. యుద్ధం వల్ల నష్టపోక తప్పదు. అది ఆర్థికవ్యవస్థపై ప్రభావం చూపి మన పొజిషన్ కే ప్రమాదం ఏర్పడే ఛాన్స్ ఉంది కాబట్టే మోదీ సర్కారు ఈ నిర్ణయం తీసుకుని ఉండొచ్చు. భారత్ ను యుద్ధం ఊబిలోకి దించాలన్నది కూడా ప్రత్యర్థి ప్లాన్ గానే భావించాలి. అందుకే దేశం తీసుకున్న ఏ నిర్ణయాన్నైనా సమర్థించాలి, స్వాగతించాల్సిందే.