ప్రపంచ నాలుగో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్ ఈ ఏడాదే అవతరించనుంది. జపాన్(Japan)ను అధిగమించి ఆ స్థానానికి చేరుకుంటుందని తన తాజా నివేదికలో అంతర్జాతీయ ద్రవ్య నిధి(IMF) తెలిపింది. 2025-26 ఏడాదికి దేశ GDP 4,187 బిలియన్ డాలర్లుగా ఉంటుందని, జపాన్ GDP 4,186 బి.డా.ను భారత్ అధిగమిస్తుందని ప్రకటించింది. 2024 వరకు భారత్ ఐదో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఉంది. ప్రస్తుతానికి నాలుగో స్థానానికి చేరుకుంటుండగా, IMF తాజా అంచనాల ప్రకారం రాబోయే సంవత్సరాల్లో మూడో స్థానానికి చేరుతుంది. 2028 నాటికి GDP 5,584 బి.డాలర్లు అవుతుండగా, జర్మనీ GDP 5,251 బి.డాలర్లకే పరిమితమవుతుందని అంచనా వేసింది. తొలి స్థానంలో 30,507 బి.డా.తో అమెరికా, 19,231 బి.డా.తో చైనా రెండో స్థానంలో ఉన్నాయి. 2027 నాటికి మన దేశం 5 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థకు చేరుకుంటుంది.