జమ్మూకశ్మీర్ పై పాకిస్థాన్ దాడులు, భారత్ గట్టి గుణపాఠంతో ఉత్తరాది(North) దద్దరిల్లుతోంది. డ్రోన్లు, క్షిపణుల్ని పాక్ ప్రయోగించగా.. జైసల్మేర్లో మిసైళ్లను మనదేశం నిర్వీర్వం చేసింది. బాంబు మోతలు దద్దరిల్లగా కశ్మీర్, పంజాబ్, రాజస్థాన్ లో కరెంటు ఆపేసి సైన్యం బ్లాక్ అవుట్ ప్రకటించింది. మిసైళ్లు, డ్రోన్లను మధ్యలోనే కూల్చేయగా.. ఎఫ్-16 ఫైటర్ జెట్ ను ప్రయోగించింది. ఈ ఎఫ్-16తోపాటు మరో రెండు JF-17 ఫైటర్ జెట్లను కూల్చివేయడంతో దాయాదికి గట్టి దెబ్బ తగిలింది. ప్రజలంతా ఇళ్లల్లోనే ఉండాలని సైన్యం హెచ్చరించింది. జమ్మూ విమానాశ్రయంపై రాకెట్ దాడి జరగ్గా, మొత్తం ఏడు చోట్ల పేలుళ్ల శబ్దాలు వినపడ్డాయి. విద్యుత్తు ఆపేయడం వల్ల ప్రత్యర్థికి లక్ష్యాలు కనపడకుండా చేయొచ్చు. ధర్మశాలలో జరుగుతున్న ఢిల్లీ-పంజాబ్ IPL మ్యాచ్ ఆపేసి ప్రేక్షకుల్ని పంపించివేశారు.