అర్థరాత్రి 1:44 గంటలకు మెరుపుదాడి.. ఆర్మీ, ఎయిర్ ఫోర్స్, నేవీ దళాల భీకర దాడులతో పాక్ ఆక్రమిత కశ్మీర్(POK)లోని తొమ్మిది స్థావరాలు ధ్వంసం.. మొత్తంగా పాకిస్థాన్ తేరుకునేలోపే ఆపరేషన్ పూర్తి. ఇదీ భారత బలగాల ఆపరేషన్ సింధూర్. ఈ దాడుల్లో లష్కరే తొయిబా(LeT) చీఫ్ హతమైనట్లు తెలుస్తోంది. పహల్గాం దాడికి ప్రతీకారంగా లష్కరే, జైషే మహ్మద్(JeM) హిజ్బుల్ ముజాహిదీన్ శిబిరాలపై జరిపిన దాడుల్లో 100 మందికి పైగా ముష్కరులు హతమయ్యారు. ఈ పరిణామాల్ని మోదీ పర్యవేక్షించగా, మెరుపు దాడుల వివరాల్ని సైన్యం ప్రకటించనుంది. 1971 తర్వాత భారత్ తొలిసారి పాక్ భూభాగంలో దాడులకు దిగింది. గత రెండ్రోజులుగా ప్రధానితో భేటీ అవుతున్న అజిత్ దోవల్.. ఈరోజు సైతం మోదీతోనే ఉన్నారు.