
అతడు మెకానికల్(Mechanical) ఇంజినీరింగ్ ఫైనలియర్ విద్యార్థి.. మిషిన్స్, టూల్స్ పై 20 రోజులు మాత్రమే ప్రాక్టికల్స్ చేశాడు. దీన్ని బట్టే అర్థమవుతుంది కదా.. ఎన్ని కంపెనీలు తిరిగినా ఉద్యోగం రాదని. ఉద్యోగాలు లేక కాదు.. సరైన ప్రతిభ లేక. దేశంలో ఏటా 15 లక్షల మంది గ్రాడ్యుయేట్లు వస్తుంటే 83% మందికి ఉద్యోగాలు రావడం లేదు. 25 ఏళ్ల గ్రాడ్యుయేట్లు 40% అలాగే మిగిలిపోతున్నారని సర్వేలో తేలింది. ఇక ప్రతిభ చూపేవారికి భారీస్థాయిలో జీతాలు దక్కుతున్నాయి. ఒకసారి కాలేజీ నుంచి బయటపడ్డారంటే ఇక ఇంటర్న్ షిప్ చేసే అవకాశమే ఉండదు. అంతలా దారుణంగా తయారైందీ వ్యవస్థ. అందుకే కంపెనీలు ఇంటర్న్ లను నియమించుకోకుండా ట్రెయినీలకు రిక్రూట్ చేస్తున్నాయి. ఒక్క బీటెక్ వాళ్లే కాదు ఎంబీఏలు ఇతర కోర్సుల పరిస్థితి కూడా అలాగే తయారైంది.