దేశంలోనే అత్యంత ధనిక(Richest) ఎమ్మెల్యేగా BJPకి చెందిన పరాగ్ షా నిలిచారు. ముంబయి తూర్పు ఘట్కోపర్ నుంచి గెలిచిన ఆయన ఆస్తులు రూ.3,400 కోట్లు. రెండో స్థానంలో కర్ణాటక డిప్యూటీ CM డి.కె.శివకుమార్ ఉన్నట్లు ADR ప్రకటించింది. కనకపుర MLA శివకుమార్ ఆస్తులు రూ.1,413 కోట్లు. వారి తాజా ఎన్నికల్లో సమర్పించిన అఫిడవిట్ల ఆధారంగా రిపోర్ట్ తయారైంది. 28 రాష్ట్రాలు, 3 కేంద్రపాలిత ప్రాంతాల్లోని 4,092 మంది MLAల వివరాల్ని ADR సేకరించింది. ఇక కమలం పార్టీకే చెందిన పశ్చిమబెంగాల్లోని ఇండస్ శాసనసభ్యుడు నిర్మల్ కుమార్ ధారా అత్యంత పేద సభ్యుడిగా నిలిచారు. ఆయన ఆస్తి కేవలం రూ.1,700 మాత్రమేనట. చంద్రబాబుకు రూ.931 కోట్లు, మంత్రి నారాయణకు రూ.824 కోట్లు, వై.ఎస్.జగన్ కు రూ.757 కోట్లు ఉన్నట్లు తెలిపింది.
ఇదే స్టోరీ పూర్తి వివరాల కోసం… https://justpostnews.com/national/richest-mlas-in-india/