ఉపరాష్ట్రపతి పదవికి రాజీనామా చేసినప్పట్నుంచి కనిపించకుండా ఉంటున్న జగదీప్ ధన్ ఖడ్(Dhankhar) ఇన్నాళ్లకు ప్రత్యక్షమయ్యారు. రాధాకృష్ణన్ ప్రమాస్వీకారానికి ఆయన రాష్ట్రపతి భవన్ కు వచ్చారు. వెంకయ్యనాయుడు పక్కన ఆసీనులై ఆయనతో ముచ్చటించారు. అనారోగ్య కారణాల పేరుతో ధన్ ఖడ్.. జులై 21న ఉపరాష్ట్రపతి పదవికి రాజీనామా చేశారు. ఆయన అజ్ఞాతంపై కాంగ్రెస్ సహా విపక్షాలన్నీ BJPపై ఆరోపణలు చేశాయి.