మేఘాలకు చిల్లులు పడ్డట్లు(Cloud Burst)గా వర్షాలు రావడంతో జమ్మూకశ్మీర్ అల్లకల్లోలమైంది. ఈ ఆకస్మిక(Sudden) వరదల్లో ముగ్గురు చనిపోగా, 100 మంది ప్రాణాలతో బయటపడ్డారు. రాంబన్ జిల్లాలో భారీ వర్షాలకు జమ్మూ-శ్రీనగర్ హైవేపై కొండచరియలు విరిగిపడ్డాయి. 40 ఇళ్లు ధ్వంసం కాగా, వాహనాలు చిక్కుకుపోయాయి. నష్రీ, బనిహాల్ సెక్షన్ల పరిధిలో రాకపోకలు నిలిపివేశారు.