మేఘాలకు చిల్లులు(Cloud Burst) పడ్డట్లు ఊహించని రీతిలో భారీ వర్షం వచ్చి వరదలు పోటెత్తాయి. 46 మంది ప్రాణాలు కోల్పోగా, 150 మందికి గాయాలయ్యాయి. వందల మందిని జవాన్లు, పోలీసులు రక్షించగా ఇంకొందరి జాడ తెలియట్లేదు. జమ్ముకశ్మీర్‌లోని మాచెయిల్ మాత(Machail Matha) యాత్రలో ఉండగా కుంభవృష్టి సంభవించింది. కిష్ట్వార్(Kishtwar) జిల్లా పద్దార్ రీజియన్‌లోని ఛసోటిలో వందలాది మంది ఉండగా, క్లౌడ్ బరస్ట్ జరిగింది. కిష్ట్వార్ కు 90 కిలోమీటర్ల దూరంలో 9,500 అడుగుల ఎత్తులో ఛసోటి ఉంది. ఈ ఊహించని ఉత్పాతంతో యాత్రను అక్కడి ప్రభుత్వం నిలిపివేసింది.