ఆర్టికల్ 370 రద్దు తర్వాత జరిగిన తొలి ఎన్నికల్లో నేషనల్ కాన్ఫరెన్స్(NC) హవా కొనసాగుతోంది. ఇక్కడ BJP రెండో స్థానంలో నిలుస్తుండగా.. కాంగ్రెస్ పార్టీ మూడో స్థానానికి పరిమితమైంది. అయితే నేషనల్ కాన్ఫరెన్స్-కాంగ్రెస్ కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే దిశగా సంపూర్ణ మెజారిటీ సాధిస్తోంది.
90 నియోజకవర్గాలు గల JKలో ప్రస్తుతం నేషనల్ కాన్ఫరెన్స్ 41 స్థానాల్లో, BJP 26 చోట్ల లీడ్ లో ఉన్నాయి. కాంగ్రెస్ 10 స్థానాల్లో, PDP 3 చోట్ల ఆధిక్యంలో కొనసాగుతున్నాయి. PDP అధినేత్రి మహబూబా ముఫ్తీ కుమార్తె ఇల్తిజా ముఫ్తీ ఓటమి పాలయ్యారు.