జమ్మూకశ్మీర్, హరియాణా శాసనసభ(Assembly)ల ఎన్నికల షెడ్యూల్ ను కేంద్ర ఎన్నికల సంఘం(CEC) ప్రకటించింది. జమ్మూకశ్మీర్లో మొత్తం 90 స్థానాలకు మూడు విడతలు(Three Phases)గా, హరియాణాలో 94 నియోజకవర్గాలకు ఒకే విడతగా ఎన్నికలు నిర్వహిస్తారు.
ఆర్టికల్ 370 రద్దు తర్వాత కశ్మీర్లో తొలిసారి ఎన్నికలు జరుగుతున్నాయి. కశ్మీర్లో 14 రోజుల పాటు పోలింగ్ జరగనుంది. 2014లో అక్కడ 5 దశల్లో 26 రోజుల పాటు ఎన్నికలు నిర్వహించారు.
షెడ్యూల్ ఇలా…
సెప్టెంబరు 18……….: జమ్మూకశ్మీర్ తొలి విడత పోలింగ్(24 నియోజకవర్గాలు)
సెప్టెంబరు 25……….: జమ్మూకశ్మీర్ రెండో విడత పోలింగ్(26 నియోజకవర్గాలు)
అక్టోబరు 1……….: జమ్మూకశ్మీర్ మూడో విడత పోలింగ్(40 నియోజకవర్గాలు)
అక్టోబరు 1……….: హరియాణాలో పోలింగ్(94 నియోజకవర్గాలు)
అక్టోబరు 4……….: జమ్మూకశ్మీర్, హరియాణా ఫలితాలు