జమ్మూకశ్మీర్ లో 48 పర్యాటక ప్రాంతాల్ని(Tourist Sites) మూసివేస్తూ ఒమర్ అబ్దుల్లా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. పహల్గామ్(Pahalgam) దాడి తర్వాత ఈ కేంద్రపాలిత ప్రాంతంలో టూరిస్ట్ స్పాట్లను మూసివేసింది. అనంత్ నాగ్, దూధ్ పత్రి, బుడ్గామ్, వెరినాగ్ ప్రాంతాల్లో రిసార్టులను క్లోజ్ చేసింది. టూరిజంపైనే ఆధారపడే కశ్మీర్ లోయ.. తాజా నిర్ణయంతో భారీగా ఆదాయం కోల్పోనుంది. పహల్గామ్ దాడిని ప్రతి ఒక్క కశ్మీరీ ఖండించాలని ఒమర్ అబ్దుల్లా కోరారు. జమ్ము, కశ్మీర్ ప్రాంతాల్లో భారీగా జనం రోడ్లపైకి రావడాన్ని స్వాగతించారు. అయితే కథువా నుంచి కుప్వారా వరకు ఏ ఒక్కరూ నిరసన తెలపకపోవడంతో ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.