అధికారిక నివాసంలో నిప్పంటుకుని నోట్ల కట్టలు కాలిన ఘటనలో హైకోర్టు జడ్జి అభిశంసన(Impeachment)కు రంగం సిద్ధమైంది. ఢిల్లీ హైకోర్టు జడ్జి వర్మ ఇంట్లో ఈ మార్చిలో భారీగా నోట్ల కట్టలు కనిపించాయి. వెంటనే అతణ్ని అలహాబాద్ బదిలీ చేసిన అప్పటి CJI సంజీవ్ ఖన్నా.. ముగ్గురు జడ్జిలతో విచారణ జరిపించారు. నివేదిక ఆధారంగా ఇక అభిశంసన చర్యలకు పార్లమెంటును కోరారు. ఆ మేరకు స్పీకర్ ఓం బిర్లాకు 145 మంది మెమొరాండం ఇచ్చారు. అందులో అధికార NDA, విపక్ష ఇండియా కూటమి సభ్యులున్నారు. పలువురు కేంద్ర మంత్రులతోపాటు రాహుల్ గాంధీ అభిశంసనకు సై అన్నారు. సుప్రీం, హైకోర్టు జడ్జిల్ని ఎలా తొలగిస్తారంటే… క్లిక్ చేసి చదవండి… https://justpostnews.com/national/how-can-judges-be-removed/