ప్రజా ప్రతినిధుల మాదిరిగానే ఉన్నత న్యాయస్థానాల్లో పనిచేసే న్యాయమూర్తులు సైతం తమ ఆస్తుల వివరాలు కచ్చితంగా వెల్లడించాలని పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ సిఫారసు చేసింది. ఇందుకు సంబంధించిన రిపోర్ట్ ను పార్లమెంటుకు సమర్పించింది. ‘లా అండ్ జస్టిస్’పై ఏర్పాటైన పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ.. ఈ మేరకు పార్లమెంటుకు రిపోర్ట్ అందజేసింది. కేంద్రం, రాష్ట్రాల్లో ఉన్నత న్యాయస్థానాలుగా భావించే సుప్రీంకోర్టు, హైకోర్టుల్లో పనిచేసే న్యాయమూర్తులు కచ్చితంగా తమ ఆస్తుల వివరాలు తెలియజేయాలని అందులో స్పష్టం చేసింది.
పొలిటీషియన్స్(Politicians), ఉన్నతాధికార వ్యవస్థ(Bureaucrats) తరహాలోనే ఆస్తుల వివరాలు వెల్లడించినట్లయితే జ్యుడీషియరీ వ్యవస్థపై మరింత నమ్మకం పెరుగుతుందని స్టాండింగ్ కమిటీ సిఫారసు చేసింది.