సుప్రీంకోర్టు తీవ్రమైన కామెంట్స్ తో విద్యుత్తు(Power) ఒప్పందాలపై ఏర్పాటైన న్యాయ విచారణ కమిషన్ ఛైర్మన్ జస్టిస్ ఎల్.నరసింహారెడ్డి పదవి నుంచి తప్పుకున్నారు. ఈ మేరకు కోర్టుకు ఆయన లేఖ రాశారు. మరోవైపు వచ్చే సోమవారం లోపు కొత్త ఛైర్మన్ ను నియమిస్తామని రాష్ట్ర ప్రభుత్వ న్యాయవాదులు అభిషేక్ మను సింఘ్వి, సిద్ధార్థ లూథ్రా న్యాయస్థానానికి తెలిపారు.
వాయిదా వేశాక…
జస్టిస్ నరసింహారెడ్డి తీరుపై సుప్రీంకోర్టు అభ్యంతరం వ్యక్తం చేసి తదుపరి నిర్ణయం తెలపాలంటూ ప్రభుత్వానికి ఆదేశాలిచ్చి కేసును వాయిదా వేసింది. మధ్యాహ్నం 2 గంటలకు మళ్లీ విచారణ మొదలయ్యే లోపునే ఆయన రాజీనామా లెటర్ ను పంపించారు. ఈ మేరకు సోమవారం లోపు కొత్త నోటిఫికేషన్ విడుదల చేయాలంటూ కేసును ముగిస్తున్నట్లు బెంచ్ స్పష్టం చేసింది.