ఢిల్లీ లిక్కర్ కుంభకోణం కేసులో జైలు శిక్ష అనుభవిస్తున్న కల్వకుంట్ల కవిత(Kavitha)తోపాటు CM అరవింద్ కేజ్రీవాల్(Kejriwal) కస్టడీని న్యాయస్థానం పొడిగించింది. ఈ ఇద్దరికీ మే 7 వరకు 14 రోజుల జ్యుడీషియల్ రిమాండ్ పొడిగిస్తూ(Extend) రౌస్ అవెన్యూ కోర్టు ఆదేశాలిచ్చింది.
కవితకు ఎట్టి పరిస్థితుల్లోనూ బెయిల్ ఇవ్వొద్దంటూ ED(Enforcement Directorate) న్యాయవాది కోర్టులో వాదించారు. ఆమెకు బెయిల్ ఇస్తే కేసుపై తీవ్ర ప్రభావం చూపుతుందని మరోసారి కోర్టు దృష్టికి తెచ్చారు.
అటు కవిత తరఫు లాయర్లు సైతం వాదనలు(Hearings) వినిపించారు. ఇరు వర్గాల వాదనలు విన్న కోర్టు… ఆమె జ్యుడీషియల్ రిమాండ్ ను మరో 14 రోజులు పొడిగించింది. దీంతో ఆమె తిహాడ్ జైలులోనే ఉండనున్నారు.