కర్ణాటక హైకోర్టులో విధులు నిర్వర్తిస్తున్న జస్టిస్ అలోక్ అరాధేను తెలంగాణ హైకోర్టు చీఫ్ జస్టిస్ గా నియమించాలని సుప్రీం కొలీజియం సిఫార్సు చేసింది. సర్వోన్నత న్యాయస్థానం చీఫ్ జస్టిస్ D.Y.చంద్రచూడ్ నేతృత్వంలో సుప్రీంకోర్టు కొలీజియం ఈ మేరకు సిఫార్సు చేసింది. తెలంగాణ సహా మొత్తం ఏడు హైకోర్టులకు CJలను నియమించాలని నిర్ణయం తీసుకుంది. మధ్యప్రదేశ్ కు చెందిన జస్టిస్ అలోక్ అరాధే 2009లో అడిషనల్ జడ్జిగా నియామకమయ్యారు. 2011 ఫిబ్రవరిలో శాశ్వత న్యాయమూర్తిగా ప్రమోషన్ పొందారు.
ఈ సిఫార్సులకు కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలపాల్సి ఉంది. సుప్రీం కోర్టు చీఫ్ జస్టిస్ గా D.Y.చంద్రచూడ్ బాధ్యతలు చేపట్టాక… జడ్జిల నియామకాల విషయంలో వేగంగా అడుగులు వేస్తున్నారు. ఆయన ఆధ్వర్యంలోని కొలీజియం ఇప్పటివరకు 11 మంది సుప్రీంకోర్టు న్యాయమూర్తులు, 68 మంది హైకోర్టు జడ్జిల నియామకానికి సిఫార్సు చేసింది.