కర్ణాటక ముఖ్యమంత్రిపై విచారణ(Prosecuted)కు ఆ రాష్ట్ర గవర్నర్ ఆదేశించడం సంచలనంగా మారింది. దీనిపై హుటాహుటిన రాష్ట్ర మంత్రివర్గం(Cabinet) భేటీ అయింది. ఈ MUDA(మైసూరు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ) స్కాం ఏంటో చూద్దాం…
సిద్ధరామయ్య తన సతీమణి బీఎం పార్వతికి మైసూరు పరిసరాల్లో 14 స్థలాలు కేటాయించడం వల్ల ఖజానాకు రూ.45 కోట్ల నష్టం వాటిల్లిందని, విచారణ జరిపించాలంటూ ప్రదీప్ కుమార్, టి.జె.అబ్రహం, స్నేహమయి కృష్ణ అనే వ్యక్తులు గవర్నర్ థావర్ చంద్ గెహ్లాట్ ను అభ్యర్థించారు. CM దంపతులతోపాటు ఆయన కుమారుడు యతీంద్ర సహా సీనియర్ అధికారుల పేర్లను ఫిర్యాదులో తెలియజేశారు.
పార్వతికి అందిన భూమిని ఆమె సోదరుడు మల్లికార్జున 1998లో కానుకగా ఇచ్చాడని సిద్ధరామయ్య అంటున్నారు. అయితే ఆ ల్యాండ్ ను అక్రమంగా సేకరించి 2004లో రిజిస్ట్రేషన్ చేయించుకున్నారని, దాన్ని 1998లోనే కొన్నట్లుగా నకిలీ డాక్యుమెంట్లు చూపారంటూ స్నేహమయి కృష్ణ ఆరోపించారు.
2014లో సిద్ధరామయ్య CMగా ఉన్న సమయంలో ఆ భూమికి పరిహారం ఇవ్వాలని పార్వతి కోరారు. ఇలా ఈ ఆరోపణల మీద వచ్చిన ఫిర్యాదులపై దర్యాప్తు చేపట్టాలంటూ లోకాయుక్తకు గవర్నర్ ఆదేశాలిచ్చారు.