Published 06 Dec 2023
పాక్ ఆక్రమిత కశ్మీర్(Pak Occupied Kashmir) భారత దేశంలో అంతర్భాగమని కేంద్ర ప్రభుత్వం మరోసారి స్పష్టం(Clarity) ఇచ్చింది. ఉగ్రవాదాన్ని అణచివేసి ఉంటే కశ్మీర్ పండిట్లంతా లోయ విడిచి వెళ్లాల్సిన అవసరం ఉండేది కాదని తెలిపింది. జమ్ముకశ్మీర్ కు సంబంధించి రెండు బిల్లుల్ని కేంద్ర ప్రభుత్వం లోక్ సభలో ప్రవేశపెట్టింది. ఇపుడు కల్పించబోతున్న రిజర్వేషన్ల ద్వారా నిర్వాసితులకు చట్టసభల్లో స్థానం కల్పించేందుకు గాను మోదీ సర్కారు ఈ బిల్లుల్ని తీసుకువచ్చింది. 7 దశాబ్దాలుగా తీవ్ర అణచివేతకు గురైన కశ్మీరీ పండిట్ల(Kashmir Pandits) కోసం చరిత్రలో తొలిసారిగా చట్టసభల్లో రెండు సీట్లను కేటాయించారు.
ఇక రెండింటికీ
జమ్ముకశ్మీర్ రిజర్వేషన్, పునర్విభజన సవరణ బిల్లుల వివరాల గురించి కేంద్ర హోంమంత్రి అమిత్ షా తెలియజేశారు. ఆ రాష్ట్ర శాసనసభ స్థానాలను 114కు పెంచుతూ ఒక బిల్లు, కశ్మీర్ పండింట్లకు మరో రెండు సీట్లు కేటాయిస్తూ నిర్ణయం తీసుకున్న ఇంకో బిల్లును సైతం లోక్ సభ ఆమోదించింది. తాజా బిల్లుల ప్రకారం ఇక నుంచి కశ్మీర్ కు 47 సీట్లు దక్కనుండగా.. జమ్ముకు 43 స్థానాలు రానున్నాయి. పాక్ ఆక్రమిత కశ్మీర్(పీవోకే)కు మిగతా 24 సీట్లు కేటాయించిన బిల్లుల్ని లోక్ సభ ఆమోదించింది. ఈ బిల్లులపై అమిత్ షా సుదీర్ఘంగా ప్రసంగిస్తూ కాంగ్రెస్ పాలనా తీరును సభ్యులకు వివరించారు.