BRS MLC కల్వకుంట్ల కవితకు సుప్రీంకోర్టు బెయిల్ మంజూరు చేసిన దృష్ట్యా ఢిల్లీలోని రౌస్ అవెన్యూ కోర్టు రిలీజ్ వారెంట్ ఇచ్చింది. సుప్రీం ఆదేశాల మేరకు రూ.10 లక్షలతో కూడిన రెండు పూచీకత్తుల్ని(Sureties) సమర్పించారు. ఆమె భర్త అనిల్, రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్ర తలో పూచీకత్తును సమర్పించగా, కోర్టు అంగీకరించింది. దీంతో ఆమె కాసేపట్లోనే విడుదల కానున్నారు.
ఇక ఆమె పాస్ పోర్టును కూడా స్వాధీనం చేయాల్సి ఉంటుంది. కోర్టు ఆదేశాలు లేకుండా విదేశాలకు వెళ్లకూడదంటూ సర్వోన్నత న్యాయస్థానం ఆదేశాలిచ్చిన సంగతి తెలిసిందే.