
దిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ అనూహ్య నిర్ణయం తీసుకున్నారు. లెఫ్టినెంట్ గవర్నర్(ఎల్జీ)తో మంత్రివర్గ సమావేశాన్ని ప్రపోజ్ చేస్తూ లేఖ రాశారు. దేశ రాజధానిలో అంతకంతకూ పెరుగుతున్న నేరాలపై చర్చించేందుకు ఈ మీట్ వేదిక కాగలదని అభిప్రాయపడ్డారు. దిల్లీలోని వివిధ ప్రాంతాల్లో 24 గంటల వ్యవధిలోనే నాలుగు దారుణ హత్యలు జరిగాయి. ‘బాధ్యత గల పౌరుడిగా, 2 కోట్ల మంది ప్రజల ప్రతినిధిగా చట్టబద్ధ పాలన కోసం పూర్తి సహకారాన్ని అందించడానికి సిద్ధంగా ఉన్నానంటూ’ లేఖలో తెలిపారు. భద్రతపై ప్రజల్లో విశ్వాసాన్ని పెంచుకునేందుకు తక్షణ చర్యలు తీసుకోవాలని లెటర్లో కోరారు. హస్తినలో లెఫ్టినెంట్ గవర్నర్, ఆప్ సర్కారు మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితులున్నాయి.
