48 గంటల వ్యవధిలో కురిసిన 57 సెంటీమీటర్ల వర్షపాతం వందలాది మంది ప్రజల్ని సజీవ సమాధి చేసింది. కొండచరియలు విరిగిపడి కేరళలోని గ్రామాలపై పడిన దుర్ఘటనలో మృతుల సంఖ్య 288కి చేరుకుంది. కొన్ని వందల మంది ఆచూకీ(Address) కనిపించకపోగా.. మృతుల సంఖ్య భారీగా పెరిగే అవకాశాలున్నాయి.
గత రెండ్రోజులుగా వయనాడ్(Wayanad) ప్రాంతంలో దుర్భర పరిస్థితి ఏర్పడింది. చూరామల్, మండక్కై ప్రాంతాలు.. చెల్లాచెదురైన మృతదేహాలతో కనిపించాయి. ఇలాంటి విషాదం ఎప్పుడూ చూడలేదని CM పినరయి విజయన్ అన్నారు. వరదల ప్రభావంపై ముందుగానే అలర్ట్ చేశామని కేంద్ర హోంమంత్రి అమిత్ షా ప్రకటిస్తే.. ఉత్పాతం ఏర్పడ్డ తర్వాత మెసేజ్ ఇచ్చారని కేరళ CM వివరించారు.
వయనాడ్ నుంచి MPగా గెలిచి రాజీనామా చేసిన రాహుల్ గాంధీ.. తన సోదరి ప్రియాంకతో కలిసి అక్కడ పర్యటించారు. ఈ ఘటనలపై కేరళ సర్కారు హై లెవెల్ మీటింగ్ ఏర్పాటు చేసింది.