మణిపూర్లో జరుగుతున్న హింసాత్మక ఘటనలపై ప్రధాని మౌనంగా ఉంటున్నారంటూ కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున ఖర్గే ఫైర్ అయ్యారు. సీఎం బీరేన్ సింగ్ ను వెంటనే పదవి నుంచి తొలగించాలని డిమాండ్ చేశారు. BJP సర్కారు ఎంత ప్రచారం చేసినా మణిపూర్ అల్లర్లలో జరిగిన ఫెయిల్యూర్స్ ని దాచలేరని అన్నారు.
‘ఆ రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలను అమిత్ షా మోడీకి వివరిస్తున్నా గత 55 రోజులుగా ప్రధాని ఒక్క మాట మాట్లాడలేదని, ప్రతి భారతీయుడు మాట్లాడుతాడని ప్రధాని ఎదురుచూస్తున్నట్టుంది పరిస్థితి’ అని ఖర్గే విమర్శించారు. మణిపూర్ అల్లర్లపై నిజంగా ఆందోళన ఉంటే వెంటనే సీఎంను మార్చాలని ఖర్గే డిమాండ్ చేశారు.