బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా జి.కిషన్ రెడ్డి మరోసారి నియమితులయ్యారు. బండి సంజయ్ స్థానంలో కిషన్ రెడ్డికి బాధ్యతలు కట్టబెడుతూ హైకమాండ్ నిర్ణయం తీసుకుంది. 2010-14 మధ్య ఉమ్మడి ఏపీ అధ్యక్షుడిగా పనిచేసిన కిషన్ రెడ్డి… 2014-16 మధ్య కాలంలో స్టేట్ ప్రెసిడెంట్ గా బాధ్యతలు చూశారు. 2016-18 మధ్య రాష్ట్ర శాసనసభా పక్ష నేతగా ఉన్నారు. 2019లో ఎంపీగా గెలిచి కేంద్ర మంత్రిగా విధులు నిర్వర్తిస్తున్నారు. అటు ఆంధ్రప్రదేశ్ పార్టీ అధ్యక్షురాలిగా దగ్గుబాటి పురంధేశ్వరిని నియమించారు. రాష్ట్ర ఎన్నికల నిర్వహణ కమిటీ ఛైర్మన్ గా ఈటల రాజేందర్ నియమితులయ్యారు. ఈ ఆదేశాలు తక్షణమే అమల్లోకి వస్తాయని పార్టీ నేషనల్ జనరల్ సెక్రటరీ అరుణ్ సింగ్ ప్రకటించారు.