భువనగిరి MP కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి.. ప్రధానమంత్రి నరేంద్రమోదీని కలిశారు. రెండు విద్యా సంస్థల(Educational Institutions)పై ఫిర్యాదు చేసినట్లు ఆయన తెలిపారు. విద్యారంగంలో దేశం అభివృద్ధి చెందాలని, ఎలిజిబిలిటీ లేని సంస్థలకు యూనివర్సిటీ హోదాను రాష్ట్ర ప్రభుత్వం కట్టబెట్టిందని, నాణ్యతా ప్రమాణాలు చూడకుండా పర్మిషన్ ఇచ్చారంటూ PMకు వివరించినట్లు తెలిపారు. రాష్ట్రంలోని గురునానక్, శ్రీనిధి సంస్థల వల్ల అనేక మంది స్టూడెంట్స్ ఇబ్బందులు పడుతున్నారని, వాటిపై చర్యలు తీసుకోవాలని మోదీకి వివరించినట్లు ఒక ప్రకటనలో వెంకట్ రెడ్డి తెలియజేశారు.
ప్రైవేటు యూనివర్సిటీ చట్టాన్నితెలంగాణ సర్కారు 2018లో ఆమోదించిందని, 5 ప్రైవేటు వర్సిటీల బిల్లుకు అసెంబ్లీ ఆమోదించినా గవర్నర్ ఆమోదముద్ర వేయలేదని గుర్తుచేశారు. రెండు ఎడ్యుకేషనల్ ఇన్ స్టిట్యూషన్ల వల్ల 3,100 మంది విద్యార్థుల పరిస్థితి అయోమయంగా తయారైందని, ఒక విద్యాసంవత్సరాన్ని కోల్పోవాల్సి వచ్చిందని కోమటిరెడ్డి వివరించారు. ఈ విషయాలపై దృష్టిపెట్టి CBI, ED సంస్థలతో ఇన్వెస్టిగేషన్ చేయించాలని కోరినట్లు కోమటిరెడ్డి తెలిపారు.