కాంగ్రెస్ పార్టీని ఎట్టి పరిస్థితుల్లోనూ నమ్మవద్దని, ఎన్నికలు జరిగే 5 రాష్ట్రాలకు ఇదే నా పిలుపు అని కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి కుమారస్వామి అన్నారు. ఇచ్చిన ఏ ఒక్క గ్యారంటీ కూడా తమ రాష్ట్రంలో అమలు కావడం లేదని బెంగళూరులో హాట్ కామెంట్స్ చేశారు. ‘కర్ణాటకలో ఇచ్చిన 5 గ్యారంటీలకు దిక్కు లేదు.. తెలంగాణలో రైతు బంధు సక్సెస్ ఫుల్ గా రన్ అవుతున్నది.. మా దగ్గర సాగుకు 5 గంటలు కూడా కరెంట్ ఇవ్వడం లేదు.. అనేక హామీలు ఇచ్చి అధికారాన్ని దక్కించుకున్న తర్వాత వాటిని అమలు చేయకుండా ప్రజలను మభ్యపెట్టి మోసం చేస్తున్నది.. కర్ణాటకలో చేయలేనివారు తెలంగాణలో చేస్తామనడం పెద్ద మోసమే.. గృహజ్యోతి, యువనిధి స్కీములు అమలు కావడమే లేదు’ అంటూ సిద్ధరామయ్య సర్కారుపై కుమారస్వామి విమర్శలు చేశారు.
కర్ణాటక నేతల ప్రచారంతో
కర్ణాటక తరహా స్కీములు, గ్యారంటీలను తెలంగాణలో అమలు చేస్తామంటూ ఇక్కడి కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో చెప్పింది. కామారెడ్డిలో రేవంత్ రెడ్డి నామినేషన్ కు హాజరైన పొరుగు రాష్ట్రపు CM సిద్ధరామయ్య.. కేసీఆర్, మోదీ సర్కార్లను తీవ్రంగా విమర్శించారు. అటు కోదాడలో పద్మావతి ప్రచారం కోసం వచ్చిన కర్ణాటక డిప్యుటీ CM డీకే శివకుమార్ సైతం BRS పాలనను విమర్శించారు. ఇలాంటి పరిస్థితుల్లో కుమారస్వామి చేసిన కామెంట్స్ మన రాష్ట్రంలో ఆసక్తికరంగా మారాయి.