ప్రస్తుతం స్లీప్ మోడ్ లో ఉన్న చంద్రయాన్-3.. మలిదశ ప్రయాణం చేపట్టడంపై ఉత్కంఠ ఏర్పడింది. ఇవాళ్టి నుంచి జాబిల్లిపై రాత్రి సమయం ముగిసి వెలుతురు రానున్న తరుణంలో విక్రమ్ ల్యాండర్, ప్రజ్ఞాన్ రోవర్ పనితీరు ఎలా ఉంటుందోనన్న ఉత్సుకత కనిపిస్తున్నది. సెప్టెంబరు 22న(రేపు) ల్యాండర్, రోవర్ మళ్లీ బయటకు వచ్చే అవకాశాలున్నాయని భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ISRO ఇంతకుముందే ప్రకటించిన సంగతి తెలిసిందే. ఆగస్టు 23న జాబిల్లి దక్షిణ ధ్రువంపై దిగిన చంద్రయాన్-3.. 14 రోజుల పాటు పరిశోధనలు సాగించింది. అయితే నిద్రాణ వ్యవస్థలో ఉన్న ల్యాండర్, రోవర్.. మైనస్ 250 డిగ్రీల ఉష్ణోగ్రత నుంచి బయటకు వస్తున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో సోలార్ ప్యానళ్ల నుంచి పవర్ అందుకోవడం ద్వారా అవి ఏ మేరకు తిరిగి రీసెర్చ్ చేస్తాయన్నదానిపై ఉత్కంఠ నెలకొంది.
సూర్యోదయం తర్వాత ఈ రెండూ తిరిగి పనిచేస్తాయా లేదా అన్నది చూడాల్సి ఉంది. 14 రోజులు పనిచేసేలా చంద్రయాన్-3ని డిజైన్ చేసింది ఇస్రో. ఇప్పటికే అనుకున్న టార్గెట్ ను అవి రీచ్ అయ్యాయి. ఒకవేళ మైనస్ 250 డిగ్రీల టెంపరేచర్ ను తట్టుకుని నిలబడగలిగితే.. మళ్లీ ప్రయోగాలు చేపట్టే అవకాశముందని ఇస్రో శాస్త్రవేత్తలు అంటున్నారు.
Good coverage