‘వందేభారత్’ ఎక్స్ ప్రెస్ రైళ్ల(Vande Bharat Express)కు ఎంతటి డిమాండ్ ఉంటుందో చూస్తూనే ఉన్నాం. స్పీడ్ పెరగడం, ప్రయాణ దూరం తగ్గడం, ఎయిర్ కండిషనింగ్(AC)తోపాటు అత్యాధునిక టాయిలెట్లు సహా సకల సౌకర్యాలతో విమాన ప్రయాణాన్ని తలపిస్తున్న ఈ ట్రెయిన్స్ కు ప్రతి చోటా ఫుల్ డిమాండ్ కనిపిస్తున్నది. దీంతో రైల్వే శాఖ క్రమంగా మరిన్ని రైళ్లను రద్దీ రూట్లలో అందుబాటులోకి తెస్తున్నది. ప్రధాని నరేంద్ర మోదీ ఈ రోజు మరో 10 ‘వందేభారత్’ రైళ్లను వర్చువల్(Virtual)గా ప్రారంభించారు.
కొత్తవాటి ప్రత్యేకతలివే…
‘వందేభారత్’ రైళ్లను దేశంలో తొలిసారిగా 2019లో ప్రవేశపెట్టారు. అలా ఈ ఐదేళ్ల కాలంలో ఇవి అత్యాధునిక(Modern) వసతులు సంతరించుకున్నాయి. ఎంత స్పీడ్ గా వెళ్తుంటాయో, అంతే స్పీడ్ గా బ్రేకులు పడటం కొత్త రైళ్ల స్పెషాలిటీ. రెండు స్టేషన్ల మధ్య సాగే దూరం ఇంకా తగ్గడం.. విమానాలు(Aircraft) స్టైల్ లో టాయిలెట్లు.. కోచ్ అంతటా ధగధగమెరిసే లైటింగ్.. ఆటోమేటిక్ ఇంటర్ కనెక్టింగ్ డోర్లు.. రెండు కోచ్ ల మధ్య సరైన నడక(Movement) సాగేలా గ్యాంగ్ వేస్ సిస్టమ్(Fully Sealed Gangways).. ఆటోమేటిక్ ఎంట్రీ(Entry), ఎక్జిట్(Exit) డోర్లు.. యూరోపియన్ స్టైల్ లో సీట్లు.. మోడ్రన్ లగేజ్ ర్యాక్స్ ఏర్పాటు చేసి కొత్త ‘వందేభారత్’ రైళ్లను ట్రాక్ పైకి తీసుకువచ్చారు.
రాత్రి జర్నీ కోసం…
రాత్రి ప్రయాణం చేయాలంటే ప్రస్తుత ‘వందేభారత్’ రైళ్లలో ఆ ప్రత్యేక సదుపాయం(Fecility) లేదు. కానీ కొత్తగా వచ్చిన వాటిల్లో రాత్రి జర్నీకి ప్రత్యేక వసతులు ఏర్పాటు చేశారు. BEML సంస్థ ఆధ్వర్యంలో ఈ వ్యవస్థను తయారు చేయించి ఈ మధ్యే వాటికి రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్ ప్రారంభోత్సవం చేశారు. ఈరోజు కొత్తగా 10 రైళ్లను ప్రవేశపెట్టగా మరో నాలుగింటిని పొడిగిస్తూ ప్రధాని జెండా ఊపారు.
కొత్త రైళ్ల రూట్లు ఇవే…
లఖ్ నవూ – డెహ్రాడూన్
అహ్మదాబాద్ – ముంబయి సెంట్రల్
న్యూ జల్పాయ్ గురి – పాట్నా
పాట్నా – లఖ్ నవూ
ఖజురహో – ఢిల్లీ(నిజాముద్దీన్)
పూరీ – విశాఖపట్నం
కలబురిగి – శ్రీ ఎం.విశ్వేశ్వరాయ టెర్మినల్ బెంగళూరు
రాంచీ – వారణాసి
మైసూరు – డా. ఎం.జి.ఆర్.సెంట్రల్(చెన్నై)
సికింద్రాబాద్ – విశాఖపట్టణం
పొడిగించిన రైళ్లు…
గోరఖ్ పూర్ – లక్నో ఎక్స్ ప్రెస్ ఇక ప్రయాగ్ రాజ్ వరకు…
తిరువనంతపురం – కాసరగోడ్ ఇక మంగళూరు వరకు…
అహ్మదాబాద్- జామ్ నగర్ ఇక ద్వారక వరకు…
అజ్మేర్ – ఢిల్లీ సరాయి రోహిల్లా ఇక చండీగఢ్ వరకు నడుస్తాయి.