రోడ్లు ఉన్నవి నడవడానికే తప్ప ప్రార్థనల కోసం కాదని ఉత్తరప్రదేశ్ CM యోగి ఆదిత్యనాథ్ అన్నారు. ఈ విషయంలో హిందువుల్ని(Hindus) చూసి నేర్చుకోవాలని హితవు పలికారు. రోడ్లపై నమాజ్ ను నిషేధిస్తూ మీరఠ్ పోలీసులు ఇచ్చిన ఆదేశాల్ని ఆయన సమర్థించారు. PTIకి ఇచ్చిన ఇంటర్వూ ఇలా….
‘రోడ్లు ఉన్నవి నడవడానికి.. హిందువుల్ని చూసి నేర్చుకోండి.. ప్రయాగ్ రాజ్ లో పుణ్యస్నానాల కోసం 66 కోట్ల మంది వచ్చారు.. ఎక్కడైనా లూటీ జరిగిందా.. ఇళ్లు తగులబెట్టారా.. ఏదైనా ఉపద్రవం ఏర్పడిందా.. కిడ్నాప్ లు, దాడులు జరిగాయా.. ఎక్కడా జరగలేదు.. ఎలా వచ్చారో అలా ఇళ్లకు చేరుకున్నారు.. హిందువుల క్రమశిక్షణ అంటే అది..’ అని యోగి గుర్తు చేశారు.