
Published 23 Dec 2023
వారంతా IT(Information Technology) ఉద్యోగులు.. తెల్లవారుజామున డ్యూటీ ముగించుకున్న తర్వాత ఇంటికి వెళ్దామని ఆఫీసులో లిఫ్టు ఎక్కారు. మొత్తం తొమ్మిది మంది లిఫ్టులో ఉన్న టైమ్ ఎనిమిదో అంతస్తు అది కిందకు పడిపోయింది. స్పీడ్ గా జారి బేస్ మెంట్ పై పడి కాళ్లు, చేతులు విరగడంతో హాహాకారాలు చేశారు. పోలీసులు అక్కడకు చేరుకుని బాధితుల్ని ప్రైవేటు హాస్పిటల్ కు తరలించారు. ఉత్తరప్రదేశ్ నోయిడా సెక్టార్ 125లోని 8వ ఫ్లోర్ లో గల ఎరాస్మిత్ టెక్నాలజీ అనే వెబ్ డెవలపర్ కంపెనీలో రాత్రి విధులు ముగించుకుని పొద్దున 5:30 గంటలకు లిఫ్ట్ ఎక్కారు. అది స్టార్ట్ అవుతూనే ఒక్కసారిగా కిందకు జారిపోతూ కుదుపులకు గురవడంతో అందులోని వారంతా ఒకరిపై మరొకరు పడ్డారు. దీంతో పలువురి ముఖాలు దెబ్బలు తగలగా.. కాళ్లు, చేతులు విరిగాయి. బాధితులంతా 30 ఏళ్ల లోపు వయసు గలవారే. ఈ ఘటనకు కారకులుగా భావిస్తూ లిఫ్ట్ మెయింటెయిన్ చేసే ఇద్దర్ని అరెస్టు చేశారు. ఇదే లిఫ్ట్ గత కొద్ది రోజుల క్రితం నాలుగో ఫ్లోర్ నుంచి కింద పడిపోయింది.
అసెంబ్లీలో స్పెషల్ బిల్
నోయిడా ఘటనపై ఉత్తరప్రదేశ్ సర్కారు తీవ్రంగా స్పందించింది. ఎలివేటర్ల నిర్వహణను ప్రతి సంవత్సరం తప్పనిసరి(Mandatory) చేస్తూ బిల్లును శాసనసభలో పాస్ చేయించాలని చూస్తోంది. మెయింటెయినెన్స్ లో నిర్లక్ష్యం వహించేవారిపై కఠిన చర్యలు ఉండేలా బిల్లుకు రూపకల్పన చేశారు. ఈ బిల్లు గత కొన్నేళ్లుగా పెండింగ్ లో ఉంది. అయితే ఘజియాబాద్ డెవలప్ మెంట్ అథారిటీ మరోసారి రాష్ట్ర సర్కారుకు లెటర్ పంపడంతో బిల్లును సభలో పెట్టబోతున్నారు.